ఉజ్జయిని హోటల్ విషాదం: వ్యర్థాల గది శుభ్రం చేస్తుండగా నలుగురు కార్మికులు దుర్మరణం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఉజ్జయిని

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శ్రీ గంగా హోటల్ వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి నలుగురు కార్మికులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. దేవాస్ రోడ్డులోని ఈ హోటల్ లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, వారిని కాపాడబోయిన మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.