విజయనగరంలో యువకుడిపై అమానుష దాడి, ఐదుగురు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా భోగాపురంలో ఆర్థిక లావాదేవీల వివాదంతో ఓ యువకుడిని దుస్తులు ఊడదీసి, తాళ్లతో కట్టి రోడ్లపై ఊరేగించారు. ఈ అమానుష ఘటనపై ఎస్పీ దామోదర్ తక్షణమే స్పందించి బాధితుడికి భయమిచ్చారు. ప్రధాన నిందితుడు మహేశ్‌తో పాటు మరో నలుగురిని హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద అరెస్ట్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.