భక్తిశ్రద్ధలతో అట్టహాసంగా సాగిన విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మల శ్రమ, నైపుణ్యం ఎంతో కీలకమని, వారి సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ప్రశంసించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.