ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల పెంపునకే కాంప్లెక్స్ సమావేశాలంటూ శేషగిరిరావు

రిపోర్టర్: G TAMMUNAIDU స్థలం: రోలుగుంట

అనకాపల్లి జిల్లా రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో భాషా ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు మాట్లాడుతూ ఇటువంటి సమావేశాల ద్వారా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు నాణ్యతా ప్రమాణాలతో మరింత మెరుగుపడతాయని తెలిపారు. బోధనలో ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ, తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం వల్ల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. భాగస్వామ్య అభ్యాసన సంస్కృతిని పెంపొందిస్తూ పాఠశాల పురోగతికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని శేషగిరిరావు కోరారు.