గుజరాత్ వర్సిటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: राजकोट

గుజరాత్లోని రాజ్కోట్ మార్వాడీ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీటెక్ విద్యార్థి హేమంత్ గధవ్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన ఈ విద్యార్థి ఆరో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలో క్యాంపస్లో ఇలాంటి ఘటనే రెండోసారి జరగడంతో విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడు మెదడు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డీసీపీ హేతల్ పటేల్ వెల్లడించారు.