భూగర్భ జలాల పరిరక్షణే లక్ష్యంగా వాటర్ రీఛార్జ్ నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోకుండా రక్షించుకోవడంలో వాటర్ రీఛార్జ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు వెల్లడించారు. స్లైడ్ ప్రెజెంటేషన్ ద్వారా వాటర్ రీఛార్జ్ ప్రాముఖ్యత మరియు భూగర్భ జలాల నిర్వహణ విధానాలను వివరించారు. ఈ పద్ధతులను సక్రమంగా అమలు చేయడం ద్వారా నీటిని కొంతవరకు అందుబాటులోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.