జీకే వీధిని కరువు మండలంగా ప్రకటించాలి: కాంగ్రెస్ నేత కారే శ్రీనివాస్ డిమాండ్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తుపానుల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయని, ఎల్ నినో ప్రభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దారాలమ్మ ఘాట్, పాలగెడ్డ రహదారులకు వెంటనే ప్రత్యేక మరామ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.