రామరాజ్యం అంటే వివక్ష లేని పాలన: ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఢిల్లీ
రామరాజ్యం అంటే ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించే పాలన అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అధికారంలో ఉండటమే పాలన లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని ఇంద్రప్రస్థ రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన.. శ్రీరాముడి ఆదర్శాలు, ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకతను దేశ ప్రజలకు వివరించారు.