ఎల్నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష: తక్షణ చర్యలకు ప్రణాళికలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయంగా తలెత్తుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ అత్యవసర సమావేశంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.