ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో ఉచిత దర్శనం కల్పించిన ఆలయ అధికారులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తుల కోసం అన్ని క్యూలైన్లను ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఉత్సవాల తొమ్మిది రోజుల పాటు రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు సులభంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే వీఐపీల కోసం భవానీ ప్రత్యేక దర్శనం పేరుతో వెయ్యి రూపాయల టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.