స్మార్ట్ టిప్స్: కారు కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్థిక లెక్కలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
కారు కొనుగోలు చేసే సమయంలో ఎక్స్ షో రూమ్, ఆన్ రోడ్ ధరల తేడాలను కచ్చితంగా పరిశీలించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ డౌన్ పేమెంట్ ఆకర్షణీయంగా అనిపించినా, అది దీర్ఘకాలంలో వడ్డీ భారాన్ని పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని, భవిష్యత్ ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.