వానదేవుడి కరుణకై గుట్టపై మోకరిల్లిన పల్లెజనం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట మండల వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాల్లేక ఎండిపోతున్న పంటలను చూసి తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు ఉపశమనం లభించింది. శనివారం కురిసిన వర్షంతో మండల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. వర్షాభావంతో దెబ్బతినే దశకు చేరిన పత్తి, మిరప, వరి పంటలకు ఈ వర్షం ఎంతగానో మేలు చేస్తుందని రైతులు తెలిపారు. ఈ వర్షంతో భూగర్భ జలాలు పెరిగి, దిగుబడి బాగుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభ సమయంలో కురిసిన ఈ వర్షం తమను గట్టెక్కించిందని సంతోషపడుతున్నారు.