'అల్ ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం': కోయంబత్తూరులో యువకుడు అరెస్ట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంచలన ఆపరేషన్ నిర్వహించి అల్ ఖైదా ఉగ్రవాద భావజాలంతో సంబంధం ఉన్న 19 ఏళ్ల మక్సూద్ అలీని తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పాకిస్థాన్ హ్యాకర్లతో సంబంధాలు నెరుపుతున్న ఈ నిందితుడిని పోలీసులు లక్నోకు తరలించి కోర్టులో హాజరుపరిచారు.