యూఎస్ ఓపెన్‌లో గంజాయి వాసన: సబలెంక ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబలెంకకు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో గంజాయి వాసన రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. 'ఇలాగే వాసన వస్తే నేను కూడా మత్తులోకి వెళ్తాను' అని చమత్కరించారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలాంటి పనులు చేయవద్దని, ఆటపై దృష్టి పెట్టడం కష్టమవుతోందని ఆమె నిర్వాహకులను కోరారు. ఈ ఘటన టెన్నిస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.