పద్మనాభస్వామి ఆలయంలో కాంతారా హీరో రిషబ్ శెట్టి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: విజయ్ స్థలం: కేరళ

కాంతారా స్టార్ రిషబ్ శెట్టి తన సతీమణి ప్రగతి శెట్టితో కలిసి కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఈ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కేరళ మంత్రి పి.సి. విష్ణునాథ్‌ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలిశారు.