ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సుప్రీంకోర్టు స్పందన కోరుతున్న ఇండియా కూటమి

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారని ఇండియా కూటమి నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు స్పందన వచ్చే వరకు ఎలాంటి పెద్ద మార్చ్లు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.