సోమశిల కాలువల మరమ్మతుల్లో రూ.10 కోట్ల భారీ అవినీతి
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు కాలువల నిర్వహణ పనుల్లో అధికారులు, బినామీ కాంట్రాక్టర్లు కలిసి రూ.10 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయకుండానే, కాగితాల్లో పనులు పూర్తయినట్లు చూపి బిల్లులు డ్రా చేశారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు లేకుండానే అధికారులు అప్రూవల్ ఇచ్చారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈ రామచంద్రమూర్తి స్పష్టం చేశారు.