టికెట్ అడిగినందుకు టీటీఈపై మహిళా ప్రయాణికురాలి వేధింపుల ఆరోపణలు
రిపోర్టర్: గోపి
స్థలం: India
ఎక్స్ ప్రెస్ రైలులో టికెట్ అడిగిన టీటీఈపై ఓ మహిళ తీవ్ర దురుసుగా ప్రవర్తించింది. తన వద్ద సరైన టికెట్ లేకపోవడంతో పాటు డబ్బులు ఆఫర్ చేస్తూ, టీటీఈ తనను అసభ్యంగా తాకాడంటూ మహిళ తన దుస్తులను తానే చించుకుని నాటకమాడింది. రాధిక తివారీగా పరిచయం చేసుకున్న ఈ మహిళ తన సోదరుడు రైల్వేలో పనిచేస్తున్నాడని బెదిరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే సేవా స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది.