వాగులోకి దూకి వివాహిత ఆత్మహత్య
రిపోర్టర్: అశోక్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర మనస్తాపంతో వివాహిత వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయి బాబా వీధికి చెందిన లక్ష్మీ భర్తతో గొడవపడి చిడిపుట్టు వంతెన సమీపంలో వాగులో దూకింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.