అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘట్టం: డిస్నీ వరల్డ్ లో కూచిపూడి ప్రదర్శన

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

అమెరికాలోని వాషింగ్టన్ ప్రసిద్ధ వాల్ట్ డిస్నీ వరల్డ్ వేదికపై తెలుగు సంస్కృతిని చాటుతూ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైందని నిర్వాహకులు తెలిపారు. ఫ్లోరిడాలో జరిగిన దివాళీ డాన్స్ ఫెస్ట్ లో ఐకానిక్ నిమో థియేటర్ లో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో కళాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గురు డాక్టర్ సాహితి నేతృత్వంలో సాగిన ఈ ప్రదర్శనను ప్రముఖులు జొన్నవిత్తుల, రామాచారి రూపకల్పన చేశారని నిర్వాహకులు స్పష్టం చేశారు.