రాష్ట్రంలో మ్యాన్ మేడ్ కరవు నెలకొందంటూ వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Amaravati

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కాకుండా కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే మ్యాన్ మేడ్ కరవు నెలకొందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి వైకాపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, కరవు మండలాలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ, వెంటనే కరవు మండలాలను ప్రకటించి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.