యాదగిరిగుట్ట ఫ్లైఓవర్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అనాలోచితంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను దుకాణదారులు, నివాస ప్రజలు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల్లో ఫ్లైఓవర్ కుదింపు పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.