పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్: పన్ను బకాయిలుంటే డబ్బులు జప్తు చేస్తారా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ఆదాయపు పన్ను బకాయిలు ఉన్నవారి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోని డబ్బులను నేరుగా జప్తు చేయలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పీపీఎఫ్ చట్టం 1968 సెక్షన్ 9 ప్రకారం ఖాతాలోని బ్యాలెన్స్కు చట్టపరమైన రక్షణ ఉంటుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే ఆ డబ్బులను విత్డ్రా చేసి సాధారణ బ్యాంకు ఖాతాలో జమ చేస్తే రికవరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు.