మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి కందుల దుర్గేశ్
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
కూటమి ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైఎస్సార్సీపీ నేతలు మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేశ్ విజయవాడలో మండిపడ్డారు. అత్యంత పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నిరుద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆ పార్టీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు.