జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఢీకొని తెదేపా నేత దుర్మరణం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాళెం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముదివర్తి నీటిసంఘం ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు తాతా శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందారు. స్వగ్రామానికి వస్తున్న శ్రీహరి ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో బైకు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు.