విజయనగరం మేయర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ స్పర్శ నామినేషన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం కార్పొరేషన్ మేయర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ డెంటల్ డాక్టర్ స్పర్శ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు ఆమె వెల్లడించారు. భర్త డాక్టర్ శ్రీకాంత్ సహకారంతో నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొంటూ, నగర ప్రజలు తమకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.