మియాపూర్ హనుమాన్ దేవాలయంలో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక హనుమాన్ దేవాలయంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. యెల్లంకి రవీందర్ గౌడ్ మరియు శ్రీనివాస్ గౌడ్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన మహోత్సవంలో మియాపూర్ గ్రామ పెద్దలు, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.