డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం అదనపు కలెక్టర్

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి, గంజాయి సాగు, డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం నషా ముక్తి భారత్ అభియాన్ పోస్టర్ను ఆవిష్కరించారు.