ప్రాణాపాయంలో ఉన్న రోగులకు నిరంతరం అండగా నిలుస్తున్న రక్తదాతలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రక్తదాతలు తెలిపారు. గర్భిణులు, ప్రమాద బాధితులు, తలసీమియా రోగులకు రక్తం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి ఎలాంటి అపోహలు లేకుండా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నామని, దీనివల్ల ఆరోగ్యం చెడిపోదనే స్పష్టత ఇచ్చారు. అత్యవసర వేళల్లో ఫోన్ రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేస్తున్నామని వారు వివరించారు.