వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై అచ్చంపేటలో బైక్ ర్యాలీ
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అచ్చంపేట మండలం హాజీపూర్ నుండి అచ్చంపేట వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను విజయవంతంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీపై అవాకలు చవాకులు పలుకుతున్నారని అన్నారు. రాబోయే పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.