ప్రజల సమస్యల పరిష్కారానికే నియోజకవర్గాల్లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారుబిల్లిలో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. దివ్యాంగుడు రఘుమండ రమణ వద్దకే వెళ్లి కలెక్టర్ స్వయంగా అర్జీ స్వీకరించడం విశేషం. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.