ముంబైలో సెక్స్టార్షన్ ముఠా గుట్టురట్టు: ఇద్దరు మహిళలతో సహా ఐదుగురి అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Mumbai

ముంబైలో ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ను వేధించి రూ.లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించిన సెక్స్టార్షన్ ముఠా గుట్టును మెరైన్ డ్రైవ్ పోలీసులు రట్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడిని బెదిరించి వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్పన బోవెల్కర్, ప్రశాంత్ ఘాడిగాంకర్, ప్రణాళి ఘాడిగాంకర్, రాబిన్ చోర్గే, అభిజిత్ కదమ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.