ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి కూటమి సర్కార్ ప్రణాళిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారీ కార్యాచరణ చేపట్టింది. 2026-27 నాటికి 5 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించేలా సెర్ప్, మెప్మా, ఎంఎస్‌ఎంఈ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పటికే రూ.1,984 కోట్లతో లక్ష యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. వ్యవసాయం, తయారీ, సర్వీస్ రంగాల్లో రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు, 35% వరకు రాయితీలు కల్పిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.