క్రాప్ హాలిడే ప్రచారంలో వాస్తవం లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టీకరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ బ్యూరో

రాష్ట్రంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎల్నినో పరిస్థితుల వల్ల అధిక నీరు అవసరమయ్యే పంటలు వేసి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే గత ఆరు నెలలుగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.