శేరిలింగంపల్లి డివిజన్లో ముమ్మరంగా వన్ డే వార్డ్ సమీక్షా సమావేశం

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని చందానగర్ వార్డులో పీజేఆర్ స్టేడియంలో వన్ డే వన్ వార్డ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మరియు అనుబంధ విభాగాల అధికారులతో పాటు స్థానిక సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌర సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై సమగ్రంగా చర్చించారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు.