ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ ఘాతంతో వ్యక్తి దుర్మరణం

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన ఏనుగుల ఐలయ్య వ్యవసాయ బావి వద్ద మోటార్కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఏబీ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.