అధికారుల నిర్లక్ష్యంతో తలకిందులుగా మారిన జాతీయ జెండా గౌరవం

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

మోత్కూరు పట్టణంలోని ఫైర్ స్టేషన్ వద్ద ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో అధికారుల తీవ్ర అలసత్వం వెలుగుచూసింది. ఫైర్ స్టేషన్ అధికారి భీముడు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయగా, మధ్యాహ్నం వరకు ఎవరూ గమనించలేదు. అటుగా వెళ్లిన సామాజిక కార్యకర్త సమాచారంతో సిబ్బంది తేరుకుని జెండాను సరిచేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, కోతులు లాగడం వల్లే జెండా అలా అయిందని అధికారి వివరణనిచ్చారు.