దేశ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ

రిపోర్టర్: రాము స్థలం: భారతదేశం

తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం దేశ అత్యంత సంపన్న కుటుంబంగా గౌతమ్ అదానీ కుటుంబం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదానీ సంపద 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరగా, ముకేశ్ అంబానీ సంపద 10 శాతం క్షీణించి రూ.8.63 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ జాబితాలో లక్ష్మీనివాస్ మిత్తల్ కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. దేశంలో వెయ్యి కోట్ల సంపద కలిగిన కుబేరుల సంఖ్య 1810కి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.