జర్నలిస్టుల డిమాండ్లపై స్పందించాలి: ఖమ్మంలో జేఏసీ కమిటీ వినతి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెండింగ్ అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల భూమిని అర్హులకు త్వరగా పంపిణీ చేయాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యలో 50 శాతం రాయితీ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.