కొడుకు ఆర్యవీర్ క్రికెట్ కెరీర్పై వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 జట్టులోకి ప్రవేశించడం మరియు అతని క్రికెట్ కెరీర్పై ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెహ్వాగ్ కుమారుడిగా జట్టులోకి రావడం వల్ల ఏర్పడే సామాజిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో కొడుకుకు తగిన సలహా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాలని ఆర్యవీర్కు సూచించినట్లు వీరూ తెలిపారు.