వైకాపా దౌర్జన్యాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సంయమనం పాటించమంటున్నా దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గతంలో వైకాపా ప్రతిపక్షాలను అణచివేసిందని, నేడు వారు ఎన్నికల్ లో పోటీలో ఉన్నారంటే సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి స్పష్టం చేశారు.