మదిరేలో సర్పంచ్ రేసు.. అభివృద్ధి బాటలో వాల్మీకి భీమేష్
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ఆదోని మండలం మదిరే గ్రామంలో యువ నాయకుడు వాల్మీకి భీమేష్ గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
పదవిలో లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి భీమేష్ కృషి చేస్తున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. మదిరేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆయన చెబుతుండటంతో, రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఆయన అభ్యర్థిత్వంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.