పల్నాడులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల వేళ ఉద్రిక్తత

రిపోర్టర్: సురేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా ఏడ్లపాడు మండలం తిమ్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని ఎంఈవో నాగరత్నం వెల్లడించారు. విధులకు వస్తున్న ప్రధానోపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలోకి బలవంతంగా చొరబడిన కొందరు వ్యక్తులు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దిగి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు.