అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కీలక భేటీ
రిపోర్టర్: రాము
స్థలం: Washington
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ చర్చల్లో కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, తైవాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. పదేళ్ల కాలంలో జిన్‌పింగ్ వాషింగ్టన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, భద్రతకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు.