రోడ్డు భద్రత మన బాధ్యత: ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని పోలీసుల పిలుపు

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని VizagCityPolice వెల్లడించారు. వాహనదారులు ప్రయాణ సమయాల్ లో హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ విధిగా ధరించాలని స్పష్టం చేశారు. అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలను కోరారు.