రామ్లీలా మైదానంలో ఇండి కూటమి ర్యాలీ: భారీగా తరలిరావాలని రాహుల్ పిలుపు

రిపోర్టర్: సతీష్ స్థలం: దిల్లీ

నవంబర్ 1న దిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండి కూటమి తలపెట్టనున్న భారీ ర్యాలీలో ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల కమిషన్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపైనే ఈ నిరసన చేపడుతున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే ర్యాలీకి ఎలాంటి అనుమతి దరఖాస్తు అందలేదని దిల్లీ పోలీసులు వెల్లడించారు.