ఆమనగల్లు అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరవుతున్నాయని మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ వెల్లడి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోందని మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ తెలిపారు. ఆమనగల్లులో అదనపు సివిల్ కోర్టు మంజూరు కావడం కక్షిదారులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం సీసీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వివరించారు.