యలమంచిలి అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Yalamanchili, Andhra Pradesh
కేంద్ర మరియు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో యలమంచిలి పట్టణం కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఈనెల 28వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీమతి పిల్లా రమా కుమారి గారికి కమలం గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.