భక్తిశ్రద్ధలతో చినమరికి గ్రామంలో వినాయక ప్రతిష్ఠాపన వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పార్వతీపురం

పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో గణనాధుడికి యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ఆనందోత్సాహాల నడుమ సంప్రదాయబద్ధంగా మొదటి పూజ నిర్వహించి శ్రీ సిద్ది గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వేడుకను ఏర్పాటు చేసిన నిర్వాహకులు బోడపిండి రవికుమార్ దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్ద సంఖ్యలో స్థానికులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.