హోరాహోరీగా ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌కు ముందు క్యాంపస్‌లో ప్రచారం ఊపందుకుంది. సాంప్రదాయ పద్ధతులతో పాటు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఉత్తర, దక్షిణ క్యాంపస్‌లలో ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది.